Coolie vs War 2: ‘కూలీ’ యూఎస్ ప్రీ-సేల్స్ ఊచకోత!! ఇదిరా అరాచకం అంటే..

ఆగస్టు 14న విడుదల కానున్న రజనీకాంత్ ‘కూలీ’ అమెరికాలో ప్రీమియర్ షోస్‌లో $1 మిలియన్ వసూలు దిశగా దూసుకెళ్తోంది. హృతిక్-ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రీ సేల్స్‌లో ‘కూలీ’తో పోల్చితే కాస్త వెనకపడింది. దీంతో ‘కూలీ’ రికార్డులు బ్రేక్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

New Update
Coolie vs War 2

Coolie vs War 2

Coolie vs War 2: ఈ ఆగస్టు 14న భారతీయ సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న భారీ క్లాష్‌కి రంగం సిద్ధమైంది. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ’(Coolie Movie), మరోవైపు హృతిక్ రోషన్(Hrithik Roshan) - జూనియర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’(War 2 Movie). ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల అవుతుండగా, ఈ పోటీపై ఇప్పుడు అంతటా అదే చర్చ జరుగుతోంది. అయితే, ఈ రెండు సినిమాల జోరు చూస్తే అమెరికాలో రజనీ సినిమా మొదటి విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది.

US ప్రీమియర్ షోల్లో ‘కూలీ’ దూకుడు.. (Coolie USA Premieres)

‘కూలీ’ అమెరికాలో ప్రీమియర్ షోలకుగాను $1 మిలియన్ మార్క్‌ దిశగా ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు $969,551 డాలర్లు వసూలు చేయగా, 1159 షోలు 431 థియేటర్లలో ప్లాన్ చేశారు. మొత్తం 37,043 టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఈ బుకింగ్స్(Coolie USA Bookings) చూస్తే, విడుదలకు తొమ్మిది రోజులు ఉండగానే ఈ చిత్రం $1 మిలియన్ మార్క్‌ను దాటటం ఖాయంగా కనిపిస్తోంది. రజనీకాంత్ కెరీర్‌లో ‘కబాలి’ తర్వాత US ప్రీమియర్ షోల్లో మిలియన్ డాలర్లు దాటే రెండవ చిత్రం ‘కూలీ’ కావడం విశేషం. 

Also Read: 'కూలీ' లో నేనే హీరో.. నా పాత్ర ఎలా ఉంటుందంటే? : నాగార్జున

ఇప్పటివరకు ‘కబాలి’ (2016) అమెరికాలో $1.92 మిలియన్ వసూలు చేసి అత్యధిక ప్రీమియర్ కలెక్షన్ సాధించింది. ఇప్పుడు ‘కూలీ’ ఆ రికార్డును దాటే అవకాశాలున్నాయి. తమిళ సినీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నాలుగు సినిమాలే $1 మిలియన్ ప్రీమియర్ కలెక్షన్ మార్క్‌ను టచ్ చేశాయి వాటిలో లియో, పోన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, కబాలి ఉన్నాయి. ఇప్పుడు ‘కూలీ’ ఆ లిస్ట్ లో చేరి, టాప్ ప్లేస్‌ని లక్ష్యంగా పెట్టుకుంది.

వార్ 2 - వెనకబడిందా..?

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘వార్ 2’ మాత్రం ప్రీ సేల్స్(War 2 USA Pre Sales) పరంగా కొంచెం వెనుకబడింది. ఇప్పటివరకు 6980 టికెట్లు అమ్ముడవ్వగా, $184,483 డాలర్లు వసూలు అయ్యాయి. ‘వార్ 2’ కేవలం 1599 షోలు, 598 థియేటర్లలో ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కన్నా తెలుగులో ఎక్కువ టికెట్లు అమ్ముడవ్వడం విశేషం.

Also Read: ‘వార్2’ నుంచి రొమాంటిక్ సాంగ్.. హృతిక్-కియార్ కెమిస్ట్రీ చూశారా?

ఫైనల్ గేమ్ - కూలీ vs వార్ 2 (Coolie vs War 2)

ఈ రెండు సినిమాల మధ్య పోటీ తారా స్థాయిలో సాగుతున్నా, ఇప్పటివరకు ‘కూలీ’ అమెరికాలో ముందడుగులో ఉంది. ప్రీమియర్ షోల్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ సినిమా విడుదలరోజు భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 కాస్త వెనుకబడినా, విడుదల తర్వాతే అసలైన పోటీ మొదలవుతోంది. ఈ రెండు సినిమాలు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి మరి.

Advertisment
తాజా కథనాలు