Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల వారికి బూడిద వర్షం.. ఆందోళనలో ప్రజలు
విఫా తుపాను కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ మండలంలో బూడిద వర్షం కురిసింది. ఇక్కడ సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇలా బూడిద పొడి వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక్కసారిగా బూడిద పొడి వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.