Bank Robbed: హిందుపురంలో భారీ చోరీ.. ఒక్కరోజు సెలవుకే బ్యాంక్ మొత్తం ఖాళీ చేసిన దొంగలు!
హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలో ఉంటున్న ఎస్బీఐ బ్యాంకులో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో.. బ్యాంకు వెనక వైపు నుంచి ఉన్న కిటికీను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి దొంగలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.