Vadde Naveen : వడ్డే నవీన్ ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యాడు.. ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వడం లేదు?

లవర్ బాయ్, ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నవీన్ ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలను ఎంచుకోలేకపోయారు.  ఆయన నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో, దర్శకులు, నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు.

New Update
vadde naveen

హీరోగా వడ్డే నవీన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట్లో చాలా హిట్ సినిమాల్లో నటించి  హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చి చూడు సినిమాలు అయన కెరీర్ లో కమర్షియల్ హిట్లుగా నిలిచాయి. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ తరువాత వరుస ప్లాపులతో హీరోగా నవీన్ ఫేడ్ అవుట్ అయిపోయారు. చివరికి ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. ఆలీతో సరదాగా లాంటి షోకు ఆయన్ను తీసుకురావాలని ఆయన అభిమానులు చాలా మంది ఇప్పటికి కోరుతున్నారు.  మీడియాతో పాటుగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్న వడ్డే నవీన్ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. 

Also Read : Israel Hostage: హమాస్‌ భూగర్భ సొరంగంలో ఇజ్రాయెల్ బందీ.. తిండి లేక, బక్క చిక్కిన శరీరంతో దీన స్థితి

ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యాడంటే 

లవర్ బాయ్, ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నవీన్ ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలను ఎంచుకోలేకపోయారు.  ఆయన నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో, దర్శకులు, నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. 2003 తర్వాత నవీన్ కెరీర్ నెమ్మదిగా డౌన్ అయింది.  సరైన కథలను ఎంచుకోవడంలో విఫలం కావడం, హీరోగా ఆయన ఇమేజ్‌కు తగ్గ పాత్రలు లేకపోవడం దీనికి కారణం. ఈ కాలంలో ఆయన నటించిన  సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. సినిమాలకు దూరమైన తర్వాత వడ్డే నవీన్ వ్యాపార రంగంపై దృష్టి పెట్టారు. నవీన్ చివరిసారిగా 2016లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఎటాక్' సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. 

Also Read: అక్కడ 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు.. ఎన్నికల సంఘంపై చిదంబరం విమర్శలు

ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వడం లేదు?

కొంతకాలం క్రితం మా ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు, మీడియా ఆయనను చుట్టుముట్టగా, అందరూ వడ్డే నవీన్ ఏమైపోయాడని అంటున్నారు.. ఎందుకంటే సినిమాలు చేయడం లేదు.. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదని ప్రశ్నించగా.. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చెప్దాంలే అనుకున్నా.. అందుకే పెద్దగా కనిపించడం లేదు. ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యానని ఆయన చెప్పారు. అయితే తాను ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కాలేదని, సరైన సమయం చూసి మళ్ళీ వస్తానని కూడా గతంలో తెలియజేశారు.  తాజా సమాచారం ప్రకారం, వడ్డే నవీన్ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, వడ్డే క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలకు, మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన మళ్లీ వెండితెరపైకి రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also read: ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528.. నెలకు జీతం ఇంత తక్కువనా?

Advertisment
తాజా కథనాలు