/rtv/media/media_files/2025/08/05/dharmasthala-mass-burial-case-2025-08-05-16-33-36.jpg)
Dharmasthala Mass Burial Case
Dharmasthala Mass Burial Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక ధర్మస్థల పుణ్యక్షేత్రం కేసులో(Karnataka Dharmasthala Case) విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల ప్రాంతంలో ఒంటరిగా ఏ అమ్మాయి కనిపించినా క్షుద్రపూజలు చేసి వారిని నరబలి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆలయ ప్రాంతంలో ఏ యువతి ఒంటరిగా కనిపించిన జీవించే అవకాశం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్షుద్రపూజల కోసం కేవలం ఒంటరి అమ్మాయిలను టార్గెట్ చేసి నరబలి ఇచ్చేవారట. ఇలా నరబలి ఇచ్చిన తర్వాత ఆ శవాలను రహస్యంగా పూడ్చి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వందల మందికి పైగా మహిళలను ఇలా నరబలి ఇచ్చి వారి జీవితాలను నాశనం చేశారని దర్యాప్తులో తెలుస్తోంది. చేతబడులు ఇలా చేసి స్థానిక ప్రజలను భయానికి గురి చేశారు. దీంతో ఆ ప్రాంతానికి ఎక్కువగా ఎవరైనా వెళ్లిన దాఖలులు లేవు. ఎందరో అమ్మాయిలను ధర్మస్థల అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారని ఇటీవల ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ధర్మ స్థల కేసు(Dharmasthala Mass Burial Case Telugu) దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. సిట్ ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది.
ఇది కూడా చూడండి: Dharmasthala Mass Burial Case: 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరం.. లో దుస్తులు.. ధర్మస్థల కేసులో వెలుగులోకి మిస్టరీ విషయాలు!
ఓ యువతి అనుమానాస్పద మృతితో.. (Dharmasthala Mass Burial Case Updates)
కొన్నేళ్ల కిందట ఓ వైద్య విద్యార్థిని ఈ ధర్మస్థల క్షేత్రంలో అనుమానాస్పదంగా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఈ కేసును అసలు సీరియస్‌గా తీసుకోలేదు. కనీసం కేసు కూడా ఫైల్ చేయలేదు. కాళ్లు ఆరిగిపోయేలా ఆ వైద్య విద్యార్థిని తల్లి పోలీసుల చుట్టూ తిరిగింది. చివరకు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు లేఖతో ఈ ధర్మస్థల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ పుణ్య క్షేత్రంలో ఎన్నో వందల మహిళలు, విద్యార్థినులు అదృశ్యమయ్యారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒంటరిగా అమ్మాయిలు ఇక్కడికి వెళ్లాలంటే భయపడుతున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.వీరిపై అత్యాచారం చేసి, బట్టలు లేకుండా, మృతదేహాలను ఈ నేత్రావతి నది ఒడ్డున పడేసినట్లు సమాచారం. ఇలా ఎందరో అమ్మాయిలు ఈ ధర్మస్థల కేసులో బలి అయినట్లు తెలుస్తోంది.
తానే పూడ్చిపెట్టినట్లు..
ధర్మస్థల పుణ్యక్షేత్రం ప్రాంతంలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎందరో మహిళా మృతదేహాలను 1995-2014 సమయంలో తన చేతుల మీదుగా రహస్యంగానే పాతిపెట్టినట్లు మృతదేహాలు అన్నింటిని కూడా బలవంతంగా పాతిపెట్టాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. అతను ఇప్పుడు పోలీసులకు లేఖ ద్వారా తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఇటీవల సిట్ జరిపిన తవ్వకాల్లో 13 ఏళ్ల బాలిక అస్థిపంజరంతో పాటు లో దుస్తులు, ఎముకలు లభించాయి. వీటిని ఫొరెన్సిక్‌కు పంపించినట్లు సిట్ అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Dharmasthala: ధర్మస్థల వివాదం.. ఎవరికీ తెలియని 6 షాకింగ్ విషయాలు!