/rtv/media/media_files/2025/08/02/srushti-fertility-center-2025-08-02-21-24-19.jpg)
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పేదల మహిళల ఆర్ధిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని ట్రాప్ చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. పేద గర్భిణీ స్త్రీలను డబ్బు ఆశ చూపించి, వారి నుంచి శిశువులను తీసుకొని, సంతానం లేని దంపతులకు అమ్ముతున్నారని తేలింది. శిశువులను కొనుగోలు చేయడానికి వారికి రూ. 90,000 చెల్లించి, దానిని సరోగసీ ద్వారా జన్మించిన శిశువుగా చెప్పి, సంతానం లేని దంపతుల నుంచి రూ. 35 లక్షల వరకు వసూలు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ మోసంలో డాక్టర్ నమ్రతతో పాటు, ఆమె కుమారుడు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, ఏజెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కూడా ఉన్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది నిందితులు అరెస్టయ్యారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో ఆమెను పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. కస్టడీలో నమ్రత మొదట నోరు విప్పడానికి నిరాకరించినప్పటికీ, ఆ తర్వాత కొన్ని విషయాలను బయటపెట్టారని తెలుస్తోంది. విచారణలో భాగంగా సరోగసీ పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆమె ఒప్పుకున్నట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆమె అంగీకరించారు
ఏపీ, తెలంగాణలో ఏజెంట్లు కళ్యాణి, సంతోషి కీలకంగా వ్యవహరించారని, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులతో డబ్బు ఆశ చూపించి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వైజాగ్, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేసి పిల్లలను తీసుకువచ్చేవారిని పోలీసులు తెలిపారు. ఇలా అక్రమ సంపాదనతో ఏపీ,తెలంగాణలో భవనాల కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో A3 కల్యాణి, A6 సంతోషి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. MNM, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ డాక్టర్ నమ్రత.. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లుగా దర్యాప్తులో తెలింది. నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్‌కు పలువురు ANM, ఆశావర్కర్లు సహకరించారని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో కూడా మహిళలే నమ్రతాకు ఏజెంట్లుగా ఉన్నారని వివరించారు.
Also Read : క్రీడల్లో ప్రపంచంతో పోటీ పడదాం : సీఎం రేవంత్‌రెడ్డి
కేసు ఎలా నమోదంటే?
ఇటీవల ఇద్దరు దంపతులు తమకు ఇచ్చిన శిశువు తమకు పుట్టలేదని డిఎన్‌ఏ పరీక్షలో నిర్ధారించుకున్న తర్వాతే ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. దాదాపు 200 మంది దంపతులు ఈ సెంటర్‌లో రిజిస్టర్ చేసుకున్నారని అంచనా. 'సృష్టి' సెంటర్ ద్వారా పిల్లలను కన్నవారు డిఎన్‌ఏ పరీక్షలు చేయించుకుంటే మరిన్ని దారుణాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Also Read : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్షలోపు రుణాలు మాఫీ
తెలంగాణ సర్కార్ అలెర్ట్
ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ నేతృత్వంలో 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అన్ని సెంటర్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని సెంటర్ల లైసెన్సులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
srushti fertility center | latest-telugu-news | telugu-news | latest telangana news | telugu crime news | telangana crime news