ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీలోని ఖీర్ గంగా నది విజృంభించడంతో క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. దీంతో గంగోత్రీలోని ధరావలి గ్రామంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా బురద రావడంతో ధరావలి గ్రామం మొత్తం బురదకు కొట్టుకుని పోయింది. ఇళ్లు, హోటళ్లు ఇలా కొండకి ఆనుకుని ఉన్న అన్ని కూడా నేలమట్టమయ్యాయి. ఈ భారీ బురద వల్ల నలుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గల్లంతు అయినట్లు తెలుస్తోంది. వందల మంది బురద కింద చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. వెంటనే NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతు అయిన వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ ఘటనపై తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Weather Update: IMD హెచ్చరిక.. ఆగస్టు 10 వరకు ఉరుములతో భారీ వర్షాలు..!
उत्तरकाशी के धराली में कितनी जनहानि हुई, इसका अंदाजा इस वीडियो को देखकर लगाया जा सकता है। 😭#uttarkashipic.twitter.com/vaufRJXsdl
— bhUpi Panwar (@askbhupi) August 5, 2025
అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి?
చాలా తక్కువ సమయంలో ఒక ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. అంటే ఒక గంటలో దాదాపుగా 100 మిల్లీ మీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా వర్షం పడితే దానిని క్లౌడ్ బరస్ట్ అని అంటారు. అయితే ఇది ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే జరుగుతుంది.
People below had no chance of survival despite trying to run away 😢😰
— Sumit (@SumitHansd) August 5, 2025
The news says four people died. I think, A lot of people died. 50 Missing.
Indian Army is stationed at ground zero…relief and rescue operations continue in Uttarkashi.#Uttarakhand#Uttarkashi#Dharalipic.twitter.com/fHutPDhLMk
ఇది రావడానికి గల కారణాలు..
సముద్రాల నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు కొండల వైపు వీచినప్పుడు ఆ గాలులు పైకి కదులుతాయి. పర్వతాలు అడ్డుగా ఉండడం వల్ల ఈ మేఘాలు ఒకేచోట స్థిరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పైకి వెళ్లేకొద్దీ చల్లగా మారతాయి. దీనివల్ల నీటి ఆవిరి నీటి బిందువులుగా మారుతుంది. సాధారణంగా అయితే ఇవి వర్షంగా కురుస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, పర్వత ప్రాంతాలలోని వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవిస్తాయి. ఘనీభవన ప్రక్రియ కొనసాగడం వల్ల మేఘాలలో నీటి బిందువుల సంఖ్య, పరిమాణం పెరుగుతాయి. దీనివల్ల మేఘాలు చాలా బరువెక్కి, వాటి సాంద్రత పెరుగుతుంది. మేఘాలు ఒక గుంపుగా ఏర్పడి, చాలా ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసుకుంటాయి. మేఘాలు తమలో ఉన్న నీటిని ఇంక మోయలేనంత బరువైనప్పుడు, ఒక్కసారిగా ఒకే చోట కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాయి. ఈ ప్రక్రియనే క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం అని అంటారు.
ఇది కూడా చూడండి:Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొండ చరియలు విరిగిపడి మొత్తం నాశనం.. భయానక దృశ్యాలు చూశారా?