Donald Trump: మరో 24 గంటల్లో భారత్‌పై భారీ టారిఫ్‌లు.. ఈ వైఖరి మార్చుకోకపోతే సుంకాల తప్పవని ట్రంప్ బెదిరింపులు

డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలు భారీగా పెంచుతానని తెలిపారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఉక్రెయిన్ యుద్ధానికి సాయం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలు భారీగా పెంచుతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి సాయం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. భారత్ తమకు స్నేహ దేశం.. కానీ వాణిజ్య విషయంలో అసలు మంచి భాగస్వామి కాదని అన్నారు. భారత్ అమెరికాతో భారీగా వ్యాపారం చేస్తుందని, కానీ అమెరికా ఆ స్థాయిలో చేయడం లేదు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

ఇది కూడా చూడండి: Trump: భారత్‌పై భారీగా టారిఫ్‌లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన

భారత్ అధికంగా చేస్తుందని ట్రంప్ 25 శాతం సుంకం విధించినట్లు తెలిపారు. ఇప్పుడు మళ్లీ వచ్చే 24 గంటల్లో దీనిని పెంచుతామని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా దేశాలు భారత్‌పై వ్యతిరేకతను చూపించాయి. అయితే వీటికి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా అణు పరిశ్రమ, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి కావాల్సిన వాటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. వీటి పట్ల భారత్ వాటిని ప్రశ్నించింది. అలాగే దేశానికి అవసరం అయ్యే విధంగా సరైన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. భారత్‌పై అమెరికా వాణిజ్య ఒత్తిడి తీసుకొస్తుందని భారత్ విమర్శించింది. తమ దేశానికి సంబంధించిన వాణిజ్య పార్టనర్లను ఎంచుకునే హక్కు తమకు ఉందని వెల్లడించింది. 

అమెరికాపై మండిపడిన రష్యా

డొనాల్డ్ చేసిన వ్యాఖ్యలకు రష్యా కూడా తీవ్రంగా మండిపడింది. కావాలనే అమెరికా భారత్‌పై ఒత్తిడిని పెంచుతోందని అన్నది. రష్యా నుంచి భారత్ చమురు కొనడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ దేశం తెలిపింది. అయితే ఈ చమురు కొనుగోలు వల్ల భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తే మాత్రం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలుస్తోంది. మరి ట్రంప్ రాగల 24 గంటల్లో సుంకాలు పెంచుతారో లేదో చూడాలి.

ఇది కూడా చూడండి: రష్యా నుంచి చమురు దిగుమతిపై కేంద్రం క్లారిటీ.. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు