/rtv/media/media_files/2025/08/05/pakistan-2025-08-05-18-32-02.jpg)
Indus Delta Crisis Pakistan
Indus Delta Crisis Pakistan:
పాకిస్తాన్‌లోని సింధు డెల్టా ప్రాంతంలో పర్యావరణ సంక్షోభం తీవ్రంగా మారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో సముద్రపు ఉప్పు నీరు రావడంతో వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల గత రెండు దశాబ్దాల్లో 1.2 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. పాక్‌కు దక్షిణాన సింధు నది అరేబియా సముద్రంలో కలిసే డెల్టాలోకి సముద్రపు నీరు భారీగా వస్తోంది. నాలుగు వైపుల నుంచి ఈ నీరు రావడంతో రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. చేప నిల్వలు తగ్గడంతో మత్స్యకారులు వేరే పనులు చూసుకుంటున్నారు. ఒకప్పుడు 150 ఇళ్లు ఉండగా ప్రస్తుతం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Pahalgam attack :పహల్గామ్ ఉగ్రదాడి పక్కా పాక్ పనే.. POKలో టెర్రరిస్ట్ అంత్యక్రియలే ఆధారాలు
“We haven’t just lost our land; we’ve lost our culture.”
— Al Jazeera English (@AJEnglish) August 5, 2025
The slow death of Pakistan’s Indus delta due to encroaching seawater.
— in pictures https://t.co/8OjzzpTXEqpic.twitter.com/3jCOhRfG4k
మంచు కరగడం వల్ల..
నీటిపారుదల కాలువలు, జల విద్యుత్ ఆనకట్టలు, వాతావరణ మార్పుల ప్రభావం, మంచు కరగడం వంటి కారణాల వల్ల 1950ల నుండి డెల్టాలోకి దిగువన నీటి ప్రవాహం 80 శాతం తగ్గిందని అమెరికా-పాకిస్తాన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ వాటర్ 2018 అధ్యయనం తెలిపింది. 1990 నుంచి నీటి లవణీయత దాదాపుగా 70 శాతం పెరిగింది. దీనివల్ల పంటలు పండించడం కాస్త ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఉప్పు నీరు రావడం వల్ల సారవంతమైన భూమి పంటకు పనికిరావడం లేదని, పండించలేకపోతున్నట్లు రైతులు తెలిపారు. ఇది కేవలం భూమిని కోల్పోవడం మాత్రమే కాదు, తరతరాల జీవన విధానం, సంస్కృతిని కూడా కోల్పోవడమని నిపుణులు చెబుతున్నారు.
లవణీయతను తగ్గించడం కోసం..
సింధూ నది పరీవాహక ప్రాంతం క్షీణతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి కలిసి లివింగ్ ఇండస్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా నేల లవణీయతను తగ్గించడం, మడ అడవులను పునరుద్ధరించడం వంటి చర్యలు చేపడుతున్నారు. మడ అడవుల పునరుద్ధరణ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ అడవులు ఉప్పునీరు రాకుండా సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి.
సొంత భూమిని విడిచి..
సింధూ నది టిబెట్‌లో ప్రారంభమై కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెళ్తుంది. ఈ నది, దాని ఉప నదులు వల్ల పాక్‌లోని వ్యవసాయ భూములకు దాదాపుగా 80 శాతం నీరు అందిస్తోంది. దీనివల్ల ఎందరో జీవనోపాధి పొందుతున్నారు. ఈ నది సముద్రంలో కలిసే సమయంలో పేరుకుపోయిన అవక్షేపాలతో ఏర్పడిన డెల్టా వల్ల ఒకప్పుడు వ్యవసాయం, చేపలు పట్టడం, మడ అడవులు, వన్యప్రాణులకు అనుకూలంగా మారింది. కానీ ఇప్పుడు ఉప్పు నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఈ భూమిని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది.
ఇది కూడా చూడండి:Heavy Rains: భారీ వర్షాలు.. 300 మంది మృతి