/rtv/media/media_files/2025/08/05/raksha-bandhan-2025-2025-08-05-19-55-23.jpg)
Raksha Bandhan 2025
హిందూ సంప్రదాయంలో సోదరి-సోదరుడుల అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగను చేసుకుంటారు. ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెల్లు ఈ పండుగను తప్పకుండా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన ఈ రాఖీ పండగను జరుపుకుంటారు. ఇప్పుడుంటే రాఖీలో ఎన్నో రకాల మోడల్స్ వచ్చాయి. వెండి, బంగారం, ప్లాటినం ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కొందరికి రాఖీ కట్టడానికి లేకపోతే నలుపు, ఎరుపు వంటి దారాలు కట్టేస్తారు. అయితే సోదరులకి ఎలాంటి రంగులో ఉండే రాఖీలు కట్టాలి? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయాల్సిందే.
ఇది కూడా చూడండి: Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
ఎరుపు రంగు
సోదరులకు ఎరుపు రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు. ఈ రాఖీ కట్టడం వల్ల సోదరుడిలో నిజాయితీ, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అలాగే ఎరుపు రంగు ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చూపిస్తారని, తప్పకుండా ఈ రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.
పసుపు రంగు
ఈ రంగు రాఖీ అనేది జ్ఞానంతో ముడిపడి ఉంటుందని పండితులు అంటున్నారు. సోదరుడికి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల చదువు లేదా పని ఇలా ప్రతీ దాంట్లో కూడా లో లేదా పనిలో ముందంజలో ఉంటారని చెబుతున్నారు. అలాగే సోదరులు ఏదైనా పని జరగాలని కోరుకుంటే అది జరుగుతుందని అంటున్నారు.
ఆకుపచ్చ రంగు
ఈ ఆకుపచ్చ రంగు రాఖీ సోదరుడికి కట్టడం వల్ల శాంతి, సమతుల్యతకు చిహ్నం. ఆకుపచ్చ రంగు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రంగు శాంతి మరియు సమతుల్యతను సూచిస్తుంది. మీ సోదరుడు జీవితంలో ఏదైనా పని ప్రారంభించినా ఆటంకం లేకుండా జరుగుతుందని అంటున్నారు.
తెలుపు రంగు
ఈ రంగు రాఖీ కట్టడం వల్ల కోపం నియంత్రణలో ఉంటుందని పండితులు అంటున్నారు. సోదరుడికి ఉన్న కోపం అంతటిని నియంత్రించి శాంతంగా ఉండే తెలుపు రంగు రాఖీ మార్చుతుందని పండితులు చెబుతున్నారు.
నీలం
ఈ రంగు రాఖీ కట్టడం వల్ల సోదరుడిలో స్థిరత్వం ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ రంగు సోదరుడిపై నీకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు. అయితే వీటిలో ప్లాస్టిక్ కాకుండా కాటన్ దారాలతో ఉండే రాఖీలను మాత్రమే సోదరులకు కట్టాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
నలుపు రంగు
ఈ రంగు జీవితంలో ఎక్కువగా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రంగు రాఖీని అసలు కట్టకూడదని పండితులు చెబుతున్నారు. ఈ రాఖీ మీ సోదరుడికి ఎక్కువగా సమస్యలను తెచ్చి పెడుతుందని అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు సంబంధిత పండితులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Raksha Bandhan 2025: ఈ రెండు సమయాల్లో రాఖీ కడితే.. అన్నీ అశుభాలే!