/rtv/media/media_files/2025/08/01/passport-one-2025-08-01-18-11-38.jpg)
అయితే ప్రతీ ఒక్క కలర్ కి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
/rtv/media/media_files/2025/08/01/passport-four-2025-08-01-18-11-38.jpg)
బ్లూ పాస్ పోర్ట్..
నీలం రంగు పాస్ పోర్ట్ సాధారణ పౌరుల కోసం జారీ చేయబడుతుంది. ఉదాహరణకు.. వ్యక్తిగత పనులు, బిజినెస్ పనులు, వెకేషన్స్ లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లేవారికి బ్లూ కలర్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. ఇందులో ప్రయాణికుడి పేరు, ఇతర బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి.
/rtv/media/media_files/2025/08/01/paasport-six-2025-08-01-18-14-25.jpg)
వైట్ పాస్ పోర్ట్
భారత ప్రభుత్వ అధికారులకు వైట్ కలర్ పాస్ పోర్ట్ జారీ చేయబడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, లేదా డ్యూటీ పని నిమిత్తం విదేశాలకు వెళ్తున్న వారు వైట్ పాస్ పోర్ట్ ఉపయోగిస్తారు. ఈ పాస్ పోర్ట్ విదేశాల్లో వీరిని ప్రభుత్వ ప్రతినిధిగా గుర్తించడానికి సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/08/01/passport-three-2025-08-01-18-11-38.jpg)
మెరూన్ పాస్ పోర్ట్
దౌత్యవేత్తలు, భారత రాయబార కార్యాలయాలు, కాన్సులెట్స్ లో పనిచేసే సిబ్బందికి ఈ రంగు పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అలాగే ఐపీఎస్, ఐఏయస్ వంటి ఉన్నత ర్యాంక్ హోల్డర్స్ కూడా అధికారిక పనుల నిమిత్తం విదేశాలకు వెళ్ళేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.
/rtv/media/media_files/2025/08/01/passport-one-2025-08-01-18-11-38.jpg)
ఎందుకు ఈ కలర్స్
అంతర్జీతీయ ప్రయాణాలను క్రమబద్దీకరించడానికి, ప్రయాణికుల హోదాను, వారి ప్రయాణ ఉదేశాన్ని తెలియజేయడానికి ఈ రంగులు సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/08/01/passport-five-2025-08-01-18-11-38.jpg)
అలాగే విదేశీ కస్టమస్ అధికారులకు, ఇమిగ్రేషన్ సిబ్బందికి ప్రయాణికుడి గురించి బేసిక్ ఇంఫర్మేషన్ అందిస్తాయి.