BIG BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ఆగస్టు 1 నుండి వాణిజ్య LPG సిలిండర్ ధరలు మళ్లీ తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి. అయితే 14.2 కిలోల గృహ LPG సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.

New Update
LPG Cylinder Price Drop

LPG Cylinder Price Drop

దేశంలో ఇవాళ్టి నుండి అంటే ఆగస్టు 1 నుండి వాణిజ్య LPG సిలిండర్ ధరలు మళ్లీ తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి. అయితే 14.2 కిలోల గృహ LPG సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. దీనిబట్టి ఇంటి కోసం వాడే సిలిండర్‌ వినియోగదారులకు ప్రస్తుతానికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. 

ఇది కూడా చూడండి:ధర్మస్థలలో కీలక పరిణామం.. బయటపడిన అవశేషాలు

LPG Cylinder Price Drop 

దేశవ్యాప్తంగా కొత్త ధరల విషయానికొస్తే.. ఈ తాజా ధరల తగ్గింపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఢిల్లీలో రూ.1,631.50.

కోల్‌కతాలో రూ.1,735.50.

ముంబైలో రూ.1,583.00.

చెన్నైలో రూ.1,790.00.

హైదరాబాద్‌లో రూ.1,886.50గా ఉంది.

కాగా వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ రేటు తగ్గించడం ఇది వరుసగా రెండో నెల కావడం విశేషం. జూలై నెల ప్రారంభంలో వాణిజ్య 19 కిలోల LPG సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1665గా ఉంది. అదే సమయంలో కోల్‌కతా-ముంబైలో రూ.1616.50గా ఉంది. 

ఇది కూడా చూడండి: ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు.. వెలుగులోకి సంచలన విషయాలు!

ఇదిలా ఉంటే ఇంటి కోసం వాడే 14.2 కిలోల LPG సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.853 కాగా.. ముంబైలో రూ.852.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల సవరణ ఇవాళ్టి నుంచి అంటే ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా వర్తిస్తుందని చమురు కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ వాణిజ్య సిలిండర్ల ధర తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్, ఇతర చిన్న వ్యాపారాలకు ఆర్థికంగా చాలా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఏప్రిల్ నుండి దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. 

తగ్గింపుకు కారణాలు

ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ధరల తగ్గుదల ప్రభావం ఇప్పుడు వాణిజ్య LPG సిలిండర్లపై కనిపిస్తోంది. ఈ ధరల మార్పులు అంతర్జాతీయ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు దేశీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో ఈ సవరణలు జరుగుతాయి. 

Advertisment
తాజా కథనాలు