Dharmasthala Case : ధర్మస్థలలో ఉద్రిక్త పరిస్థితి.. 9వ స్పాట్‌లో తవ్వకాలలో కీలక ఆధారాలు లభ్యం

ధర్మస్థలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  9వ స్పాట్‌లో తవ్వకాలలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి.  ఎముకల ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు  డీటెయిల్స్ సేకరిస్తున్నారు.

New Update
case

ధర్మస్థలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  9వ స్పాట్‌లో తవ్వకాలలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి.  ఎముకల ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు  డీటెయిల్స్ సేకరిస్తున్నారు. సమాచారం బయటకు  వెళ్లకుండా కఠిన చర్యలు  తీసుకుంటుంది సిట్ బృందం. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో SIT బృందం పరదాలు కట్టింది. సెల్‌ఫోన్లు స్వాధీనంతో పాటు, అధికారుల వివరాలు గోప్యంగా ఉంచారు. కూలీలను ఎవరూ కలవకుండా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు.  నేత్రావతి నది పరిసర ప్రాంతాల్లో భారీగా జనం గుమికూడారు. 

Also Read :  తేజశ్వీ యాదవ్‌కు బిగ్‌ షాక్.. ఓటర్‌ లిస్టులో పేరు మిస్సింగ్

100 కి పైగా మృతదేహాలను

1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలంలో 100 కి పైగా మృతదేహాలను ఎక్కువగా మహిళలు, మైనర్లను రహస్యంగా ఖననం చేయమని బలవంతం చేశారని  మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల చేసిన మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో  సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం జూలై 28న దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదుదారుడు గుర్తించిన 15 ప్రదేశాలలో మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఆరోపించిన ప్రాంతాల్లో తవ్వకాలను ప్రారంభించింది. మొత్తంగా ఈ కేసు కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది, దీని వెనుకున్న నిజానిజాలను బయటపడాలని ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం  దర్యాప్తు వేగవతంగా కొనసాగుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో దీనిపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Also Read :  నేను ఏ తప్పు చేయలేదు.. కోర్టులోనే ఏడ్చేసిన ప్రజ్వల్‌ రేవణ్ణ

అయితే  ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడుఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ మిగిలి ఉంది. ఫిర్యాదులో, మాజీ స్వీపర్ 1995 నుండి 2014 వరకు ధర్మస్థల ఆలయ పరిపాలన కోసం పనిచేస్తున్నానని చెప్పాడు. 1998 నుంచి 2014 మధ్య, వందలాది మృతదేహాలను ఖననం చేయడానికి తనను బలవంతం చేశారని తన వాంగ్మూలలో  ఆరోపించాడు.   ఇక  సంచలనం సృష్టించిన ఈ ధర్మస్థల మృతదేహాల కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. కేసును ఉపసంహరించుకోవాలని ఫిర్యాదుదారుడిని బెదిరించారని సిట్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ గౌడపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఫిర్యాదుదారుడి న్యాయ బృందం సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతికి ఇమెయిల్ ద్వారా అధికారిక ఫిర్యాదును సమర్పించింది. 

Dharmasthala case updates | latest-telugu-news | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు