BIG BREAKING: బోర్డర్‌లో హై టెన్షన్.. పాక్-భారత్ మధ్య మళ్లీ కాల్పులు

భారత్-పాక్ బోర్డర్‌లో హై టెన్షన్ నెలకొంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దాదాపుగా 15 నిమిషాల పాటు కాల్పులు జరిపిందట. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది.

New Update
Ind vs pak war

Ind vs pak war

భారత్-పాక్ బోర్డర్‌లో హై టెన్షన్ నెలకొంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు కాల్పులు జరిపిందని తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదు. అయితే ఉగ్రవాదులు మళ్లీ ఎంటర్ కావడానికి ప్రయత్నించే అవకాశం ఉందని సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్‌ఓసి వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఆర్టికల్ 370 రద్దు 6వ వార్షికోత్సవం సందర్భంగా పాక్ పూంచ్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ప్రస్తుతం బోర్డర్‌లో హైటెన్షన్ ఉండటంతో భద్రతను పెంచారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు. 

ఇది కూడా చూడండి: Donald Trump: మరో 24 గంటల్లో భారత్‌పై భారీ టారిఫ్‌లు.. ఈ వైఖరి మార్చుకోకపోతే సుంకాల తప్పవని ట్రంప్ బెదిరింపులు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని..

ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌పై పాకిస్తాన్ ఉగ్రదాడికి పాల్పడింది. పహల్గామ్ వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ కాల్పుల్లో దాదాపుగా 26 మంది మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో విరుచుకుపడింది. అర్థరాత్రి సమయంలో డ్రోన్లతో కాల్పులు జరిపింది. పాక్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. భారత్ జరిపిన ఈ దాడుల్లో ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఇరు దేశాలు మధ్య కాల్పులు జరిగిన తర్వాత కాల్పుల విరమణను అంగీకరించాయి. కానీ పాక్ ఇప్పుడు ఆ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పాక్ భారత్‌పై కాల్పులు జరిపింది. దీనికి భారత్ కూడా సైలెంట్‌గా ఉండకుండా ప్రతీకారం తీర్చుకుంది. ఈ కాల్పుల్లో ఎవరైనా మృతి చెందారా? లేదా? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Indus Delta Crisis Pakistan: డేంజర్‌లో పాకిస్తాన్.. సింధూ నది డెల్టాలోకి ఉప్పు నీరు.. ప్రాంతాన్ని వదిలి వెళ్తున్న రైతులు

Advertisment
తాజా కథనాలు