/rtv/media/media_files/2025/08/05/talk-to-write-2025-08-05-20-17-13.jpg)
Talk to write
కొందరికి చదవడం అంటే ఇష్టం. కానీ రాయడం అంటే చిరాకు. ఈ కారణంగానే ఇచ్చిన వర్క్‌ను అసలు చేయరు. అయితే కేరళకు చెందిన ఇలా రాసే ఒక అద్భుతమైన టూల్ ఆవిష్కరణ చేశాడు. మనిషి చెబుతుంటే రాసే సాధనాన్ని ఆవిష్కరించి అందరితో ఔరా అనిపించాడు. కేరళ ఎక్స్‌పో 2025లో భాగంగా ఒక విద్యార్థి రాస్పెబెర్రీ పై, ఆర్డుయినో, పైథాన్‌లను ఉపయోగించి టాక్ టూ రైట్ AI టూల్ తయారుచేశాడు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విద్యార్థి చెబుతుంటే టూల్ రాస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరూ ఆ విద్యార్థి తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: High Tech Paint: ఇంటిని కూల్ చేసే పెయింట్.. ఇది ఉంటే అసలు ఏసీ అక్కర్లేదు
Kerala engineering student and team wowed visitors at Ente Keralam Expo 2025 with “Talk to Write” — an AI-powered device that converts speech into handwritten notes using Raspberry Pi and Arduino.
— Mid Day (@mid_day) August 5, 2025
The innovative tool acts as a digital scribe, writing down spoken words… pic.twitter.com/qWLVSLGSEc
అల్గారిథమ్ ఉపయోగించి..
కేరళకు చెందిన ఒక యువ ఇంజనీరింగ్ విద్యార్థి అజయ్ 'టాక్ టు రైట్' అనే వినూత్నమైన AI-ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశాడు. ఇది విద్యార్థి చేతి రాతను కాగితంపై రాస్తుంది. దానికి మనం చెబుతుంటే అలానే రాస్తుంది. దీన్ని అజయ్ ఎంటె కేరళం ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. ఈ టూల్ విద్యార్థులకు హోంవర్క్ భారాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ 'టాక్ టు రైట్' సాధనం AI అల్గారిథమ్‌లను ఉపయోగించి రాస్తుంది. ముఖ్యంగా ఈ టూల్ రాస్పెబెర్రీ పై, ఆర్డుయినో, పైథాన్ వంటి అధునాతన సాంకేతికతల ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించిన AI అల్గారిథమ్‌ల వల్ల ఇది మనిషి వాయిస్‌ను సులభంగా అర్థం చేసుకుని, దాన్ని చేతిరాతలోకి మార్చగలుగుతుంది. రాస్పెబెర్రీ పై అనేది ఒక చిన్న కంప్యూటర్. ఇది ఈ ప్రాజెక్ట్‌కు మెదడులా పనిచేస్తుంది. ఆర్డుయినో అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లను నియంత్రించడానికి ఉపయోగపడే ఒక మైక్రోకంట్రోలర్. పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ భాష. దీనిని ఉపయోగించి ఈ టూల్‌ను అజయ్ ఆవిష్కరించాడు.
హోం వర్క్ భారం తగ్గుతుందని..
ఈ టూల్ వల్ల విద్యార్థులకు హోంవర్క్ భారం తగ్గుతుందని అజయ్ తెలిపారు. అంతేకాకుండా రాయడంలో ఇబ్బందులు పడేవారికి, దివ్యాంగులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ టూల్ కేవలం అక్షరాలను మాత్రమే కాకుండా, పూర్తి పేరా గ్రాఫ్‌లను కూడా రాయగలదు. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో విద్యారంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి టూల్స్ వల్ల విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టడానికి వీలవుతుంది. రాయడం వల్ల సమయం వృథా కాకుండా వారు ఇతర విషయాలపై దృష్టి పెట్టవచ్చని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Agentic AI: ఉద్యోగస్తులకు బిగ్ షాక్.. ఏజెంటిక్ ఏఐతో ఈ రంగాల వారి జాబ్‌లు ఔట్.. 1.8 కోట్ల ఉద్యోగాలు గల్లంతు!