/rtv/media/media_files/2025/07/31/tamil-nadu-2025-07-31-15-13-34.jpg)
వచ్చే ఏడాదిలో జరగనున్న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏకు ఊహించని షాక్ తగిలింది. అన్నాడీఎంకే బహిష్కర నేత, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమికి వీడ్కొలు పలికారు. సీఎం స్టాలిన్ తో 2025 జులై 31వ తేదీ గురవారం రోజున మార్నింగ్ వాక్ లో భేటీ అయ్యారు పన్నీర్ సెల్వం. అక్కడ ఇద్దరి మధ్య కొద్దీసేపు చర్చలు సాగాయి. ఈ భేటీ జరిగిర కొన్ని గంటల్లోనే ఎన్టీఏ నుంచి వైదొలుగుతున్నట్లు పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఈ విషయాన్ని పెన్నీర్ సెల్వం విశ్వాసపాత్రుడు అయిన పన్రుతి ఎస్. రామచంద్రన్ తెలిపారు.
#Tamil#tamilnadupolitics#panneerselvam#OPS@CMOTamilnadu@AIADMKITWINGOFL@arivalayam@DMKITwing@mkstalinpic.twitter.com/5Q4LgP3Fb9
— The News Agency (@TheNewsAgency1) July 31, 2025
పన్నీర్ సెల్వం రాష్ట్రవ్యాప్తంగా పర్యటన
ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. త్వరలోనే పన్నీర్ సెల్వం రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపడతారని, ప్రస్తుతం ఏ పార్టీతోనూ పొత్తు లేదన్నారు. భవిష్యత్తులో ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తామని అన్నారు. కాగా పన్నీరుసెల్వంను ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ నుండి బహిష్కరించారు. ఆ పార్టీ నాయకత్వం ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి (EPS) చేతుల్లో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలలో పన్నీరుసెల్వం తన సొంత నియోజకవర్గం అయిన రామనాథపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది.
ఎన్డీయే కూటమిలో ప్రాధాన్యత లేదని
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తమిళనాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పన్నీరుసెల్వంకు ప్రధానితో సమావేశమయ్యే అవకాశం లభించకపోవడం ఆయన వర్గంలో అసంతృప్తికి దారితీసింది. ఎన్డీయే కూటమిలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన శిబిరం భావిస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్ (SSA) నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పన్నీరుసెల్వం ఇటీవల బహిరంగంగా విమర్శలు గుప్పించారు, ఇది బీజేపీ పట్ల ఆయన వైఖరిలో మార్పును సూచిస్తుంది. పన్నీరుసెల్వం ఎన్డీయే నుంచి వైదొలగడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనమే అని చెప్పాలి.
2026 మేలో అసెంబ్లీ ఎన్నికలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 మేలో జరగనున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి M. K. స్టాలిన్ నేతృత్వంలోని DMK ప్రభుత్వం తన పాలనను కొనసాగించాలని చూస్తుండగా, ప్రతిపక్ష AIADMK తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా DMK, AIADMK చుట్టూ తిరుగుతాయి. 2026 ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం కొత్త పార్టీ 2026 ఎన్నికలలో పోటీ చేయనుంది. విజయ్ ఇప్పటికే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. తన పార్టీ 1967, 1977 ఎన్నికల మాదిరిగానే కొత్త పార్టీలు గెలిచిన విధంగానే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీల మధ్య పొత్తులు, నాయకత్వ సమస్యలు, కొత్త పార్టీల ప్రభావం వంటి అంశాలు ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి