UP Minister Sanjay Nishad: వరదల్లో చనిపోయిన వారు స్వర్గానికే.. వారిని బాధ పెట్టేలా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌ దెహాత్‌ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సంజయ్ నిషాద్.. ‘గంగమ్మతల్లి తన తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనం ద్వారానే మీరంతా స్వర్గానికి వెళతారు’అన్నారు. సంజయ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

New Update
UP minister Sanjay Nishad

UP Minister Sanjay Nishad

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కావాల్సిన వారిని పోగొట్టుకోవడంతో పాటు ఇళ్లు, సామాగ్రి ఇలా అన్ని కూడా కోల్పోతున్నారు. నిజం చెప్పాలంటే వారి ఒంటి మీద కేవలం దుస్తులు మాత్రమే ఉంటున్నాయి. వీరికి ఎలాంటి ఆధారాలు కూడా ఉండవు. ఎక్కడ ఉండాలో, తినాలో కూడా తెలియదు. ఇలాంటి వారిని చూస్తే కఠిన మనస్సు వారైనా కూడా ఓదార్చే విధంగా మాట్లాడతారు. కానీ ఓ మంత్రి మాత్రం వారిని బాధపెట్టేలా వ్యాఖ్యలు చేశారు. సమస్య అనేది సాధారణం అంటే చాలా లైట్ తీసుకున్నట్లు మాట్లాడారు. ప్రస్తుతం ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

ఇది కూడా చూడండి: కన్నీళ్లు పెట్టుకున్న హేమంత్ సోరెన్.. ఓదార్చిన మోదీ-PHOTOS

వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి..

యూపీ మంత్రి సంజయ్ నిషాద్ కాన్పూర్ దెహాత్ జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఎక్కువగా వరదలు రావడంతో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించి బాధితులు పరామర్శించారు. అన్ని కోల్పోయి బాధలో ఉన్న వీరికి మంత్రి ఓదార్పునివ్వకుండా బాధ పడేలా అన్నారు. బాధితులు  తమ బాధను మంత్రికి చెప్పుకున్నారు. ఇప్పుడు మేం ఉంటున్న ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఇళ్లు అన్ని పూర్తి కూలిపోయాయి. అసలు ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదని బాధ పడ్డారు. ఈ మాటలు విన్న మంత్రి గంగమ్మ తల్లి తన బిడ్డల పాదాలను కడగడానికి వస్తుంది. గంగమ్మ దర్శనం ద్వారా వరదల్లో చనిపోయిన వారంతా కూడా స్వర్గానికే వెళ్తారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే మిమ్మల్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఓదార్చకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Amit Shah: మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం

Advertisment
తాజా కథనాలు