/rtv/media/media_files/2025/08/02/saina-2025-08-02-21-26-36.jpg)
కొన్ని వారాల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తిరిగా తాము ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని సైనా తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కొన్నిసార్లు దూరమే సన్నిహితుల విలువ తెలియజేస్తుందని అర్థం వచ్చేలా ఆమె రాసుకొచ్చారు. ఇందులో కశ్యప్ తో ఉన్న ఫోటోను జోడించారు. కాగా జూలై 13న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా నెహ్వాల్... కశ్యప్‌తో విడిపోవాలని అనుకుంటున్నట్లుగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. సైనా నెహ్వాల్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
All the best...it takes guts to be public about it when you know it can fail again#saina_nehwalpic.twitter.com/VNHXmIhbQ3
— kesari🕉🚩 (@UnapologeticH_1) August 2, 2025
2018లో ప్రేమించి పెళ్లి
కాగా వీరిద్దరూ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు, అక్కడ ఇద్దరూ లెజెండరీ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు. ఇక్కడే వారిద్దరి ప్రేమకథ ప్రారంభమైంది. అయితే వారి విడిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియకపోయినా, కశ్యప్‌తో గడిపిన క్షణాలకు సైనా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
సైనా తన ఒలింపిక్ కాంస్య పతకం, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌తో ప్రపంచ ఐకాన్‌గా మారారు. కరణం మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ ఆమె. 2015లో, సైనా మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఆడింది. ఇక కశ్యప్ ప్రపంచ టాప్ 10లోకి ప్రవేశించి 2014 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాన్ని సాధించాడు. 2024 ప్రారంభంలో తన క్రీడా జీవితాన్ని ముగించినప్పటి నుండి కశ్యప్ కోచింగ్‌ను ప్రారంభించాడు.
Also Read : Nimisha Priya case : నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్...వారికి రెడ్ సిగ్నల్