Vikarabad Crime: ఎంతకు తెగించావురా.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, తొమ్మిదేళ్ల బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారయత్నం చేశాడు.

New Update
rape

Vikarabad Crime

Vikarabad Crime: 

కామంధులు రెచ్చిపోతున్నారు. వావివరుసలే కాదు వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లలపై అఘయిత్యాలకు పాల్పడుతున్నారు.తాజాగా వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, తొమ్మిదేళ్ల బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారయత్నం చేయడంతో  బాలిక భయంతో వణికిపోయింది.

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్ లో కసాయి భర్త.. ప్రియురాలి కోసం భార్య, పిల్లల్ని ఏం చేశాడంటే!


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చన్గోముల్ నేవీ రాడార్ స్టేషన్‌లో బాధిత బాలిక తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా అదే ప్రాంగణంలో నిందితుడు కూడా కూలీ పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ రోజు బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఆమె ఒక్కతే ఉండడాన్ని నిందితుడు గమనించాడు. ఏకాంతంగా ఉండడాన్ని గుర్తించిన నిందితుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చూడండి:Wife Killed Husband: పొరిగింటి యువకుడితో ఎఫైర్.. యూట్యూబ్‌లో చూసి భర్తను చంపించిన మహిళ

భయపడిన బాలిక కేకలు వేయడంతో  గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా భయంతో బాలిక వణికిపోవడంతో బాలికను కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో(Pocso) చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి:UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!

Advertisment
తాజా కథనాలు