Zomato Delivery Boys Protest: జొమాటోకు భారీ షాక్‌.. ఇన్సెంటివ్స్ కోసం డెలివరీ బాయ్స్‌ ఆందోళన

ఆర్డర్‌ ఇవ్వగానే నిమిషాల్లో తెచ్చి ఇచ్చే జొమాటో డెలివరీ బాయ్స్‌ ఆందోళనకు దిగారు. రోజు 12 నుంచి 14 గంటలు కష్టపడితే కనీసం రూ. 5 వందలు కూడా రావటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి కడుపు తాము నింపుతుంటే యజమాన్యం తమ కడుపు కొడుతుందంటూ నిరసన చేపట్టారు.

New Update
Big shock for Zomato

Big shock for Zomato.. Delivery boys protest for incentives

Zomato Delivery Boys Protest: 

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వగానే నిమిషాల్లో మన ముందుకు తెచ్చి ఇచ్చే జొమాటో డెలివరీ బాయ్స్‌ ఆందోళనకు దిగారు. రోజు12 నుంచి 14 గంటలు కష్టపడితే కనీసం రూ. 5 వందలు కూడా రావటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి కడుపు తాము నింపుతుంటే యజమాన్యం తమ కడుపు కొడుతుందంటూ యాజమాన్యం తీరుకు నిరసనగా డెలివరీ బాయ్స్‌ నిరసన చేపట్టారు. ఎటువంటి సందర్భంలోనైనా, ఎలాంటి కాలంలోనైనా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సమయానికి వారికి ఆహారం తెచ్చి ఇస్తున్న తమపై కంపెనీ నిర్లక్ష్యం వహిస్తోందని.. పేమెంట్లు, ఇన్‌సెంటివ్స్‌ ఇవ్వడం లేదని జొమాటో డెలివరీ బాయ్స్‌ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో మంగళవారం ( ఆగస్టు 5 ) హైదరాబాద్ లోని ఉప్పల్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

డెలివరీ బాయ్స్ కి ఉండే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని, డెలివరీ చేస్తుండగా ప్రమాదాలకు గురైతే వైద్యం కోసం ఇన్సూరెన్స్ లేని పరిస్థితి ఉందంటున్నారు డెలివరీ బాయ్స్. సమయానికి డెలివరీ అందివ్వాలన్న ఆరాటంలో చాలామంది ట్రాఫిక్‌లో ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు, మూడు నెలలుగా తమకు సరిగా పేమెంట్లు ఇవ్వడం లేదని వాపోయారు. తమ కష్టానికి తగిన డబ్బులు రావడం లేదని, ఇచ్చే ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వడం లేదని జొమోటో యాజమాన్యంపై డెలివరీ బాయ్స్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇది కూడా చూడండి:UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!

ఐదారు సంవత్సరాలుగా జొమోటోలో పని చేస్తున్నా ఆదాయం రావడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. వర్షంలో డెలివరీ చేస్తున్నా వర్షానికి డెలివరీ టారిఫ్‌లు ఇవ్వకుండా, డెలివరీ బాయ్స్‌కి ఇవ్వాల్సిన టారిఫ్‌లు వినియోగదారులపై ఎక్కువగా వేస్తున్నారని ఆరోపించారు. ఆ టారిఫ్ డబ్బులు కూడా జొమాటో యాజమాన్యమే తీసుకుంటుందని డెలివరీ బాయ్స్ ఆరోపించాఉ. తమకు రావలసినడబ్బుల కోసం ఆందోళన చేస్తుంటే పోలీస్‌ కేసులు పెడతామని జొమాటో యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని ఆవేదన డెలివరీ భాయ్య్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన డబ్బులు, ఇన్సెటివ్‌లు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డెలివరీ బాయ్స్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా స్థానిక జొమాటో బాధ్యుల  హామీ మేరకు కొద్దిసేపు ఆందోళన తర్వాత డెలివరీ బాయ్స్‌ విరమించారు.

ఇది కూడా చదవండి:మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం

Advertisment
తాజా కథనాలు