/rtv/media/media_files/2025/08/02/srushti-fertility-case-2025-08-02-16-59-13.jpg)
Srushti Fertility Centre
Srushti Fertility Centre : సరోగసి పేరుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన మోసాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో ఐదుగురు బాధితులను సరోగసి పేరుతో.. మోసం చేసి వారినుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారని తేలింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో పాటు NRI లను సైతం నిండా ముంచేశారని తాజాగా బయటపడింది. ఇదిలా ఉంటే.. నమ్రతా బ్యాంక్ ఖాతాలతోపాటు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన అధికారులు... భారీగా నగదు బదిలీలు జరిగినట్లుగా గుర్తిచారు.
Also Read:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
ఐదురోజుల పాటు పోలీసు కస్టడిలో డాక్టర్ నమ్రత , పోలీసులకు ఏ మాత్రం సహకరించలేదని తెలుస్తోంది. చెప్పిందే చెప్పడం, తాను తప్పు చేయలేదని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో డాక్టర్ విద్యుల్లతను విదేశాలకు పారిపోతుండగా CISF పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రతతో కలసి సరోగసి, ఐవిఎఫ్ లను విద్యుల్లత నిర్వహించేవారని తేలింది. సరోగసి కోసం వచ్చే దంపతుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నమ్రత.. తనపై ఎవరికీ అనుమానం రాకుండా , సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అనుమతులు విద్యుల్లత పేరుతో తీసుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది.
Also Read:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
తాజాగా నమ్రతతోపాటు.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించారు. 2019 నుండి 2025 మధ్య వారి ఖాతాలో భారీగా నగదు క్రెడిట్ అయినట్లుగా గుర్తించారు. దాంతో వారి బ్యాంక్ ఖాతాలను కూడా ఫీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లు రాజస్దాన్ దంపతులు మాత్రమే బయటకు రాగా, తాజాగా మరో ఐదుగురు బాధితులు తామూ సరోగసి పేరుతో నమ్రతా చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. పిల్లలు లేని దంపతులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు వస్తే చాలు, సరోగసి వద్దు, ఐవిఎఫ్ ముద్దంటూ మాయమాటలు చెప్పి, నమ్మించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఓవైపు డాక్టర్ నమ్రతను విచారిస్తూనే, కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు నిందితులను కూడా వేరువేరుగా విచారిస్తున్నారు. ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లలో వరుస తనిఖీలు నిర్వహించిన పోలీసులు, పలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!