/rtv/media/media_files/2025/08/05/tollywood-shooting-band-2025-08-05-19-11-43.jpg)
Telugu Movie Shooting Bandh
Telugu Movie Shooting Bandh:
టాలీవుడ్ లో వేతనాలు 30 శాతం పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం ఏడాదికి 10 శాతం చొప్పున మూడేళ్లకు 30 శాతం వేతనాలని పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతల నుంచి సానుకూలన స్పందన రాకపోవడంతో తెలుగు ఫిలిం ఫేడరేషన్ కార్మికులతో కలిసి సమ్మెకు పిలుపునిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండానే రాత్రిరాత్రే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో టాలీవుడ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె కారణంగా మీడియం, చిన్న సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి:మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం
పలు షూటింగ్స్ నిలిచిపోవడంతో నిర్మాతల మండలి సభ్యులు మెగాస్టార్ చిరంజీవి నివాసరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.కార్మికుల వేతనాల పెంపుపై చిరంజీవితో నిర్మాతలు చర్చలు జరిపారు. సడెన్‌గా షూటింగ్స్ ఆపేయడంపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు.రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని నిర్మాతలకు సూచించారు. లేకపోతే తన సినిమా కోసం తానే నిర్ణయం తీసుకుంటానన్న చిరు స్పష్టం చేశారు.
సమావేశం ముగిసిన అనంతరం అనంతరం నిర్మాత సి. కళ్యాణ్ మీడియాలో మాట్లాడారు. నిర్మాతలు చిరంజీవి గారిని కలిసి సమస్య చెప్పామన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించాము. దీనిపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదని, మీ సమస్యలు చెప్పారు అటు వైపు కార్మికుల వెర్షన్‌ను కూడా తెలుసుకుంటానన్నారని వివరించారు. అటు పెఢరేషన్ నాయకులతోనూ చర్చిస్తానని చింరజీవి స్పష్టం చేశారు. వేతనాల సమస్యలపై రేపు నిర్ణయం చెబుతామని నిర్మాతలు వెల్లడించారు.చిరంజీవి ఇంట్లో సమావేశంలో పాల్గొన్న వారిలో అల్లు అరవింద్, సుప్రియ, మైత్రి రవి, దిల్ రాజు.. పలువురు గిల్డ్ నిర్మాతలు సమావేశమయ్యారు. వేతనాల పెంపు వివాదం, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను చిరంజీవికి వివరించారు.
Also Read:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
మరోవైపు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మా ప్రెసిడెంట్ విష్ణు చర్చలు జరుపుతున్నారు.30 శాతం వేతనాలు పెంచలేమని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు.దీంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతలు ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే యూనియన్స్ తో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న వాళ్ళను సినీ పరిశ్రమలోకి తీసుకుంటాం అని నిర్మాతలు ఓ వైపు పని మొదలుపెట్టారు.
ఇది కూడా చూడండి:UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!