/rtv/media/media_files/lsyB24Z0shyxeON84b7Y.jpg)
Konda Surekha's sensational reaction!
సినీ నటి సమంత విడాకుల అంశంలో మాజీమంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ‘ఈ దేశ న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్తేమి కాదు. నా జీవితమే ఒక పోరాటం. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణం. ఇది జరిగి రెండు రోజులైంది. అని చెప్పు కొచ్చింది. అయితే, కొండా సురేఖ కేసులో సంచలనం.. బిగ్ బ్రేకింగ్.. అంటూ వార్తలు రాస్తున్నారు. ఈ విషయంలో కొందరి ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తోంది. కొండా సురేఖ పేరు వినగానే.. కొంతమంది రిపోర్టర్లు నా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని మీడియా, సోషల్ మీడియాల్లో రాస్తున్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. చివరగా నేను చెప్పేది ఒకటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..ఇక గాలిలో తేలిపోవాల్సిందే..
Mattress Damage Case - Konda Surekha
కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావాపై నాంపల్లి న్యాయస్థానం విచారణ జరిపింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడుతూ మంత్రి.. సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. విడాకుల అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ నెల 21లోపు మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను కోర్టు బీఎన్ఎస్ 356 కింద పరిగణలోకి తీసుకుంది. ఇదే సమయంలో మంత్రి తరఫు న్యాయవాది అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని.. కేసు నమోదుకు ఆదేశాలివ్వాలన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Also Read : క్రీడల్లో ప్రపంచంతో పోటీ పడదాం : సీఎం రేవంత్‌రెడ్డి
nampally-court | ktr vs konda surekha | konda surekha comments | latest-telugu-news | telugu-news | latest telangana news | telugu crime news