Komatireddy Venkat Reddy: మా సోదరుడికి మంత్రి పదవి నా చేతిలో లేదు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తను లేనని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పార్టీ పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదన్నారు. మంత్రిపదవుల విషయంలో హైకమాండ్‌, ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

New Update
Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy:

తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తను లేనని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారో లేదో మీ ఇష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రాజగోపాల్‌కు పార్టీ పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదని తేల్చి చెప్పారు. మంత్రి పదవుల విషయంలో హై కమాండ్‌, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. నేనే కాదు ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేరని తేల్చి చెప్పారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి, ఇప్పించే పరిస్థితిలో తాను లేనని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్

మాది జాతీయ పార్టీ అని అధిష్టానిదే తుది నిర్ణయం ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు.తాను మంత్రి పదవులకోసం ఏనాడు ఢిల్లికి రాలేదన్నారు. అధిష్టానమే నాకు మంత్రి పదవి ఇచ్చిందని స్పష్టం చేశారు. తాను సీనియర్‌ మంత్రినని తను ఎన్‌ఎస్‌యుఐ, కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశానన్నారు. విధేయుడిగా ఉంటేనే పదవులు వస్తాయన్న ఆయన తనకు అలాగే వచ్చిందని తెలిపారు.

ఇది కూడా చూడండి:AP Crime: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 15 మందికి..

కాగా, గత కొంతకాలంగా పార్టీ తీరుపై రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపిస్తున్నారు. పదవి ఇస్తామని చెప్పి పార్టీలోకి ఆహ్వానించారని.. భువనగిరి ఎంపీ సీటును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. తాను ఎవరి కాళ్లు పట్టుకుని పదవి తెచ్చుకోలేనని స్పష్టం చేశారు. అలాగని తాను ఊరుకునేది లేదన్నారు. మంత్రి పదవి కోసం తాను ఎంత దూరం అయినా వెళ్తానని.. దిగజారి బతకడం తనకు తెలియదన్నారు.  పార్టీ మారిన వారికి, తన కంటే చిన్న వారికి పదవులు ఇచ్చారని.. తాను సీనియర్‌నని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకున్నారు.

అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితిలో పార్టీ హై కమాండ్‌ లేదన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. అందులోనూ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రెడ్డి సామాజికవర్గానికి మరో స్థానం కేటాయించే పరిస్థితి లేదు. ఒకే జిల్లాకు మూడు పదవులు అదీ ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం సాధ్యం కాదు. రాజగోపాల్ రెడ్డికి పదవి కేటాయించాలంటే ఆయన సోదరుడితో రాజీనామా చేయించాలి.  కానీ, ఆయన చేసే పరిస్థితిలో లేరు. పైగా గతంలో ఆయన రేవంత్‌ రెడ్డిని వ్యతిరేకింంచినప్పటికీ ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆయన రేవంత్‌ రెడ్డికి నమ్మిన బంటులా తయారయ్యారు. దీంతో రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి అంతా ఈజీ కాదన్నది జగమెరిగిన సత్యం.

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్ లో కసాయి భర్త.. ప్రియురాలి కోసం భార్య, పిల్లల్ని ఏం చేశాడంటే!


#komati-reddy-venkata-reddy #congress-party #komati-reddy-venkat-reddy #komatireddy-rajagopal-reddy #Komatireddy Brothers
Advertisment
తాజా కథనాలు