Srushti Fertility Centre : సృష్టి కేసులో సంచలన విషయాలు.. ఆ గ్యాంగులతో నమ్రతకు లింకు

సృష్టి షెర్టిలిటీ సెంట‌ర్‌ దారుణాలు ఒకటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నమ్రతను విచారించిన పోలీసులు ఆమె నుంచి అనేక విషయాలు రాబట్టారు. సంతానం కోసం వచ్చే వారికి పిల్లల్ని ఇవ్వడానికి పిల్లలను ఆమ్మే పలు గ్యాంగులతో నమ్రత లింకులు పెట్టుకున్నట్లు పోలీసులు తేల్చారు.

New Update
Srushti Fertility Center

Srushti Fertility Centre

Srushti Fertility Centre : సృష్టి షెర్టిలిటీ సెంట‌ర్‌ దారుణాలు ఒకటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత ఐదు రోజులుగా పోలీస్‌ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతను ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజలపాటు విచారించిన పోలీసులు ఆమె నుంచి అనేక విషయాలను రాబట్టారు. ఆసుపత్రికి వచ్చే దంపతులకు పిల్లలను విక్రయించడం కోసం నమ్రత పిల్లలను ఆమ్మే పలు గ్యాంగులతో లింకులు పెట్టుకున్నట్లు పోలీసులు తేల్చారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పలు పిల్లలను దొంగిలించే గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది.. పిల్లల్ని కొని అమ్ముతున్న నందిని, హర్ష,పవన్‌ లతో నమ్రతకు సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. వీరంతా గతంలో పిల్లల్ని అమ్ముతూ పట్టుబడిన నిందితులు కావడం గమనార్హం. వీరికి 3-నుంచి 5 లక్షలు ఇచ్చి వారు తీసుకువచ్చిన పిల్లల్ని కొనుగోలు చేసేదని తేలింది.

ఇది కూడా చదవండి:మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం

అంతే కాకుండా ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో నిర్దారించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించిన నమ్రత పేదింటి వారిని టార్గెట్ చేసుకున్నట్టు తేలింది. ఫెర్టిలిటీ సేవలు అందిస్తామని అబద్దాలు డెలివరీ తరవాత నవజాత శిశువులను కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. ఇక ఈ కేసులో నమ్రతపై 6ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

కాగా నమ్రతపై ఇప్పటికే 6 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. మొదట వెనుకడుగు వేసిన బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒకరొకరిగా వచ్చి చెప్పుకుంటున్నారు. తెలంగాణ లోని నల్గొండకు చెందిన దంపతుల నుంచి  నమ్రత 44 లక్షల రూపాయలు కొట్టేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రతతో పాటు అర్చన, సురేఖ, సదానందం, చెన్నారావుపై కేసు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసి చేస్తామంటూ హార్మోన్‌ ఇంజక్షన్‌లు ఇచ్చినట్లు వారు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  కొన్ని రోజుల తర్వాత కల్యాణి గ్యాంగ్ విశాఖకు పిలిచి స్పెర్మ్‌ తీసుకొని పంపించినట్లు, ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో 18 లక్షల రూపాయలు కాజేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ నమ్రత, డా. విద్యులత, కల్యాణి, శ్రీనివాసరెడ్డి, శేషగిరిపై కేసు నమోదైంది.

Also Read:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా పలువురు ఎన్నారైలు కూడా డాక్టర్ నమ్రత గ్యాంగ్‌ చేత మోసపోయారు. ఈ విషయంలోనూ ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి 25 లక్షల రూపాయలు కాజేశారు.ఈ మేరకు నమ్రతపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన బాధితుల నుంచి ఈ గ్యాంగ్‌ 50 లక్షల రూపాయలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, చెన్నారావు, సురేఖపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 కాగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బండారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సంతానం లేరన్న  సమస్యతో వచ్చే దంపతుల్ని డాక్టర్ నమ్రత విశాఖలోని తమ సృష్టి ఆసుపత్రికి తీసుకెళ్లి నమ్మించి, తర్వాత సరోగసీ చేస్తున్నట్లు నటించి అండాలు, వీర్యం సేకరించినట్లు గుర్తించారు. ఏవేవో కారణాలు చెప్తూ అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసేవారు.  సికింద్రాబాద్‌లోని ల్యాబ్ టెక్నీషియన్‌ గొల్లమండల చెన్నారావు ద్వారా వారిని మోసం చేసి దంపతుల అండాలు, వీర్యాన్ని సేకరించేవారు. దాని కోసం గాంధీ హాస్పిటల్ డాక్టర్ నర్గుల సదానందంతో బాధితులకు మత్తుమంతు ఇప్పించేవారని పోలీసులు గుర్తించారు.

అనంతరం డోనర్ గర్భం దాల్చిందని, మీ బిడ్డ పెరుగుతోందంటూ డబ్బులు ఎక్కువగా ఖర్చవుతుందంటూ లక్షల రూపాయలు వసూలు చేసేవారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈలోగా ఏజెంట్లు నందిని, సంజయ్‌ సాయంతో అస్సాంకు చెందిన మహిళల నుంచి పిల్లలను కొనుగోలు చేసి తీసుకొచ్చి దంపతులకు ఇచ్చి వారి బిడ్డగా నమ్మించేవారని వెల్లడించారు. ఈ మొత్తం ప్రక్రియలో బాధితులకు ముఖ్యమైన రికార్డులు ఏవీ ఇవ్వకుండా జాగ్రత్తపడేవారని పోలీసులు తెలిపారు.  

ఇది కూడా చూడండి:UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!