/rtv/media/media_files/2025/08/01/telangana-govt-women-bus-driver-2025-08-01-14-10-44.jpg)
Telangana govt offering women bus driver FREE 3 month residential training in Hyd
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వడమే దీని ముఖ్య లక్ష్యం. తెలంగాణలో తొలి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్‌గా నియమితులైన సరితను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది.
ఈ ట్రైనింగ్‌ను పేదరిక నిర్మూలన సంస్థ (SERP), మోవో (MoWo) అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ట్రైనింగ్‌లో అర్హత సాధించిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే విషయాన్ని ఇటీవల మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు రవాణా రంగంలో కూడా రాణించేందుకు ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మహిళలను ఆర్థికంగా, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
Also Read: సైబర్ మోసాలపై అప్రమత్తత.. హైదరాబాద్‌లో తగ్గుతున్న కేసులు, కొత్త ట్రెండ్‌లు!
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న తెలంగాణ మహిళల విద్యార్హతలు, వయస్సు, ఎత్తు, వారి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని నియమాలను పొందుపరిచింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
🚍 Telangana women- become a bus driver!
— Mowo Social Initiatives (@MOWO__Hyd) July 25, 2025
We’re offering FREE 3-month residential training in Hyd for 100 women with SERP & TSRTC.
✔️21–40 yrs
✔️10th pass
✔️160cm+ height
✔️TS Aadhar
📞 Call 8978862299 (Mon–Sat, 9:30–5:30)
Tag / Share / Repost#WomenInMobility#DrivingChangepic.twitter.com/955sQCxDsI
అర్హతలు
21 - 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
తెలంగాణలో జారీ అయిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
ఎత్తు: 160సెం.మీ ఉండాలి.
శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
3 నెలల రెసిడెన్షియల్ శిక్షణ ఉంటుంది.
ఇంటర్వ్యూలు, సెలెక్షన్ విషయానికొస్తే.. టెలిఫోనిక్ ద్వారా అలాగే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
డ్రైవింగ్ & సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ విషయానికొస్తే.. 3 నెలల రెసిడెన్షియల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత 6 నెలల సాఫ్ట్ స్కిల్స్ + భద్రతా ట్రైనింగ్ ఇస్తారు.
Also Read: సృష్టి కేసులో సంచలనం..సరోగసి చేయకున్న చేసినట్లు నమ్మించాం...డాక్టర్ నమ్రత వాంగ్మూలం
చివరిగా ఉద్యోగ నియామకం & ఇంటర్న్‌షిప్ ఉంటుంది. దీని ద్వారా ఉచితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించనున్నారు.
దీనిపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా.. తెలంగాణలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా నియమితులైన సరితను ఆమె ఘనంగా సత్కరించారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి, ఆత్మగౌరవంతో జీవించడానికి ఇది దోహదపడుతుందని ఆమె అన్నారు. మహిళా డ్రైవర్ సరిత నాయక్‌ను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించామని మంత్రి తెలిపారు.
తొలి మహిళా డ్రైవర్ సరిత ఎవరు? (First Women Bus Driver In Telangana)
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, సీత్యాతండాకు చెందిన సరిత.. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా నియమితులై చరిత్ర సృష్టించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే ఆమె చదువు మానేశారు. అప్పటి నుంచి ఆటో నడపడం నేర్చుకుని కుటుంబానికి అండగా నిలిచారు. ఆ తర్వాత హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. అనంతరం ఢిల్లీలో ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC)లో బస్ డ్రైవర్‌గా దాదాపు 10ఏళ్ల పాటు పనిచేశారు. అయితే ఆమె తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి తిరిగి తెలంగాణాకు వచ్చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో డ్రైవర్ ఉద్యోగం కోసం ఆమె మంత్రులను కలిసి విన్నవించుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. ఆమెకు ఆర్టీసీలో బస్ డ్రైవర్‌గా అవకాశం కల్పించింది.
bus-driver | tgsrtc-bus | latest-telugu-news | telugu-news | latest telangana news