Hyderabad Rain: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!

హైదరాబాద్ లో మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్ యూసఫ్‌గూడ, బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.

New Update
Rain

Rain

హైదరాబాద్ లో మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్ యూసఫ్‌గూడ, బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మరో వైపు ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

వర్షపు నీటితో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాలు ముందు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు వర్షం, మరో వైపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం కారణంగా భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు హైదరాబాద్ తో పాటు వరంగల్, ములుగు, సిద్దిపేటతో పాటు మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా షేక్ పేట్, మణికొండ, గోల్కొండ, లంగర్ హౌస్, నార్సింగి, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇంకా కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, బీహెచ్ఈఎల్, తెల్లాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అవసరం ఉంటేనే భయటకు రావాలని వారు హెచ్చరిస్తున్నారు. అవకాశం ఉన్న ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆయా కంపెనీలు సైతం ఆ వెసులుబాటును కల్పించాలని కోరుతున్నారు.  ఎక్క‌డైనా వ‌ర‌ద ముప్పు ఉన్న‌ట్ల‌యితే రౌండ్‌ది క్లాక్ ప‌ని చేసే హైడ్రా కంట్రోల్ రూమ్ (9000113667)కి ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. 

Advertisment
తాజా కథనాలు