Assam Assembly Elections: అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై షాకింగ్ సర్వే.. గెలిచేచి ఆ పార్టీనే!

అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ 45 రోజుల పాటు సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల శాంపిల్స్ కలెక్ట్ చేసిన ఈ సర్వేలో బీజేపీ 69 నుంచి 74 సీట్లు గెలుస్తుందని తేలింది. 39 శాతం ఓట్లు బీజేపీ పార్టీకి పోలవుతాయని పీపుల్స్ పల్స్ సంస్థ చెప్పింది.

Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టు పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కొంటా కిస్సారం అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.

priyanka gandhi: రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి బాజాలు

గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా వివాహం తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చయమైంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు.

Ballari : ఐరన్‌ డాన్‌ వర్సెస్‌ గ్రానైట్‌ కింగ్... 20 ఏళ్లుగా..వాల్మీకి సాక్షిగా..

స్టీల్ సిటీ బళ్లారిలో రెండు రెడ్ల టైకూన్‌లు ఢీ కొడుతున్నాయి. ఒకరు గాలి జనార్దన్‌ రెడ్డి మరొకరు నారా భరత్‌రెడ్డి..ఉనికి కాపాడుకోవడానికి ఒకరు..భవిష్యత్‌ నిర్మించుకోవడానికి మరొకరు..దీనికి సందర్భం వాల్మీకి జయంతి..బళ్లారి సెంటర్‌ఎస్పీ సర్కిల్‌ ఇందుకు అడ్డా..

Explainer: పిట్టల్లా రాలిపోతున్న యంగ్, హెల్తీ ఇండియన్స్.. కారణమేంటి?

ఈ మధ్య కాలంలో యువత నడివయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ధృడమైన శరీరాలు కలిగిన30 ఏళ్లలోపు వ్యక్తుల ఊహించని మరణాల వెనుక గుండెపోటు కారణమనే వాదన ఉంది. యువకులు ఆకస్మిక కుప్పకూలిపోవడం, మరణించడం భారతదేశంలో అత్యంత కలవరపెట్టే వైద్య వాస్తవాలలో ఒకటిగా మారింది.

FASTag : FASTag యూజర్లకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. ఆ రూల్ రద్దు!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. కార్లు, జీపులు, వ్యాన్ల తదితర ప్రైవేట్ వాహనాల FASTag వెరిఫికేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.

AP-TG: నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది.కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని నోటిఫై చేస్తూ జల్‌శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Russian: చీమ కూడా దూరకుండా పుతిన్ ఇంట్లో సెక్యురిటీ.. ద మస్కెటీర్స్ గురించి తెలిస్తే షాక్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై అటాక్ కలకలం రేపింది. పుతిన్ నివాసం అంటే కేవలం ఓ బిల్డింగ్ కాదు, అదొక శత్రు దుర్భేద్యమైన కోట. అలాంటి కోటనే ఆయన శత్రువులు టార్గెట్‌గా పెట్టుకొని దాడి చేశారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ డ్రోన్‌ను నేలమట్టం చేసింది.

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి మృతి.. 2వారాల్లో నాల్గవ హత్య

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు అమానవీయంగా దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

BIG BREAKING: వెనిజులాని ఆక్రమించుకున్న ట్రంప్

వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించినట్లు అధ్యక్షుడు ట్రంప్ శనివారం తెలిపాడు. ఈ ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యని అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని, దేశం దాటించినట్లు ట్రంప్ ప్రకటించారు.

venezuela : వెనెజువెలా రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు

డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ వెనెజువెలా మీదా అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్‌ గత కొంతకాలంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ దేశ రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది.

Indonesia Pre Marital Sex Ban : పెళ్లికి ముందు శృంగారం..ఇక మీదట జైలుకే..సర్కారు సంచలన నిర్ణయం

ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఇండోనేషియా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ వివాదస్పద చట్టాన్ని అమల్లోకి తెస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ చట్టం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపేలా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

Mexico Earthquake: మెక్సికోలో భూకంపం..పరుగులు తీసినజనం

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది.

Saudi Arabia vs UAE : మరోసారి అంతర్యుద్ధం...సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో రెండు శక్తిమంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యెమెన్‌ లో ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు చెరోవర్గానికి మద్ధతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యద్ధానికి దారితీస్తోంది.

DGP ముందు లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత దేవా.. 48 మంది సరండర్

తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సి దేవా శనివారం లొంగిపోయాడు. దేవాతోపాటు 48 మంది నక్సలైట్లు సరండర్ అయ్యారు. హిడ్మా మృతి తర్వాత అతని స్థానంలో దేవాని మావోయిస్టు పార్టీ నియమించింది. కీలక నేతలు లొంగిపోవడంతో PLGA బెటాలియన్ మొత్తం కనుమరుగైంది.

TiE Hyderabad : టై హైదరాబాద్‌ కొత్త అధ్యక్షుడిగా మురళీ కాకర్ల

గ్లోబల్ ఎంట్రప్రెన్యూరియల్ నెట్‌వర్క్ అయిన టై ఈ హైదరాబాద్, 2026 సంవత్సరానికి మురళీ కాకర్లను అధ్యక్షుడిగా, రవి చెన్నుపాటిని ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. గతంలో అధ్యక్షుడిగా ఉన్నరాజేష్ పగడాల నుండి మురళీ కాకర్ల అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు .

Vehicle Tax : కొత్త బైక్‌ కొంటున్నారా?  రూ.2 వేలు సెస్సు కట్టాల్సిందే..

కొత్తగా బైక్‌ కొంటున్నారా? అయితే మరో రెండు వేలు అధనంగా చెల్లించాల్సిందే.అవును కొత్తగా బైక్‌ కొంటే ఇకమీదట రూ.2 వేలు సెస్సు కట్టాల్సిందే. కేవలం బైక్‌ మాత్రమే కాదు కారు కొంటే రూ.5వేలు.. భారీ వాహనాలైతే రూ.10 వేలు చెల్లించాల్సిందే.

TG News :  న్యూ ఇయర్‌ విషాదం..ప్రాణాలు తీసిన అడవి పంది..

నూతన సంవత్సరం సందర్భంగా బిర్యానీ తినేందుకు వెళ్లిన స్నేహితులను అడవిపంది రూపంలో మృత్యువు వెంటాడింది. కారుకు అడ్డంగా అడవిపంది రావడంతో దాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు రెఢీ..ఈ నెలలోనే నోటిఫికేషన్‌? ఫిబ్రవరిలో ఎన్నికలు?

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని భావిస్తున్న ప్రభుత్వం అదే జోష్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 11 లేదా 20న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

TS TET 2026 : నేటి నుంచే టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు..పరీక్షలకు సర్వం సిద్ధం

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ఈ రోజు (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు మొత్తం 9 రోజులు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.  

Etala Rajender : గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను కాకుల్లా పొడవొద్దు.. ఈటల సంచలన కామెంట్స్!

పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి అక్కున చేర్చుకోండి. కాకులు గద్దల లెక్క పొడవకండి. స్థానికంగా గ్రూపులు మంచివి కావు. గ్రూపులు బువ్వ పెట్టవని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలన్నారు.

BREAKING: డ్రగ్స్ తీసుకున్న MLA కొడుకు అరెస్ట్

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో MLA కొడుకుని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది.

Sankranti : సంక్రాంతి బరిలోకి దిగేందుకు సై అంటోన్న పందెం కోళ్లు

సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో గుర్తొచ్చేవి కోడి పందేలు. ఏపీలో సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో స్థిరపడిన ఆంధ్రవారు అంతా తమ సొంతూళ్లుకు చేరుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా గ్రామాలకు చేరుకుంటారు. కోడి పందేల కోసం నెలల తరబడి కోళ్లకు శిక్షణ ఇస్తుంటారు.

AP నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి.. ఛార్జిషీట్‌లో షాకింగ్ విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని 18వ నిందితుడిగా పేర్కొన్న అధికారులు, ఆయన పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు.

Rewind 2025: 2025 ఆంధ్రప్రదేశ్‌..విషాదాలు...విజయాలు

మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విజయాలు లేకపోలేదు.  ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది.

Sankranthi Fest: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది.

BREAKING: తెలంగాణకు బిగ్ షాక్.. బనకచర్లకు CWC అనుమతులు.. సాక్ష్యాలు బయటపెట్టిన హరీశ్ రావు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ బనకరచ్ల మరోసారి చర్చనీయాంశమైంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. దీనిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

Cabinet: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనా సౌలభ్యం, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు అలాగే కొన్ని నియోజకవర్గాల మార్పులకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2